Events displayed in timezone: Europe/London
- This event has passed.
ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER): ఏమిటి? ఎందుకు? ఎలా? విద్యను పoచుదాం…జ్ఞానాన్ని విస్తరిద్దాం
March 4, 2024 @ 6:30 am - 7:30 am BST
ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER): ఏమిటి? ఎందుకు? ఎలా?
విద్యను పoచుదాం…జ్ఞానాన్ని విస్తరిద్దాం
ఈ సంవత్సరం 2024 ఓపెన్ ఎడ్యుకెషన్ వీక్ లో భాగంగా 2024 మార్చి 4వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు జస్ట్ రైట్.ఇన్ – హైదరాబాద్ మరియు COEL Dr BRAOU (https://www.braou.ac.in/viewdirector/36#gsc.tab=0) సంయుక్తంగా ఒక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
OER అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు,శాస్త్రజ్ఞులకు ఎంతో ఉపకరిస్తాయి, అంతేకాకుండా అవి అపరిమితమైన అవకాశాలనూ అందిస్తాయి. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) అంటే ఏమిటి, ఎందుకు ఉపయోగించాలి? OER ఎక్కడ అందుబాటులో ఉంటాయి? వాటి ప్రాముఖ్యత మొదలైన అంశాలపై 60 నిముషాలపాటు సాగే ఈ అవగాహన కార్యక్రమంలో 30 నిమిషాలపాటు OER పై Mrs. Sushumna Rao Tadinada (Justwrite.in) అవగాహన కలిగించే ఒక ప్రెజెంటెషన్ ఉంటుంది. 15నిముషాలు (OER): ఏమిటి? ఎందుకు? ఎలా? ఒక చర్చ ఆ తర్వాత 15 నిముషాలు సందేహ నివృత్తికై (Q and A) కేటాయిస్తాము. ఈ అవగాహనా కార్యక్రమాన్ని జస్ట్ రైట్.ఇన్ -హైదరాబాద్ మరియు COEL DrBRAOU (https://www.braou.ac.in/viewdirector/36#gsc.tab=0) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం OER ప్రాముఖ్యత, ఎందుకు ఉపయోగించాలి, అలాగే OER (ఉచిత విద్యా వనరులను) ను ఎక్కడ ఎలా అన్వేషించాలి, ఒకవేళ మీరు మీ స్వంత వనరులను OERగా అందించాలనుకుంటే వాటిని ఓ పెన్ లైసెన్స్ తో ఎప్రచురించడం ఎలా? అనే అనే అంశాలపై స్పష్టతను అందించనుంది. విద్యా రంగంలో కొత్త ప్రయోగాలకు మరియు సృజనాత్మకతకు స్థానం సృష్టించడానికి OER దోహదం చేస్తాయనడంలో అతిశయోక్తిలేదు. మీరు ఈ వెబినార్‌లో చేరడానికి ఆసక్తి ఉంటే, దయచేసి ముందస్తుగా ఫిబ్రవరి 28 వ తారీఖు లోపల మీ వివరాలను ఇక్కడ ఇచ్చిన గూగుల్ ఫార్మ్ లో నమోదు చేసుకోండి.
గూగుల్ ఫార్మ్:
https://forms.gle/3nQMV2a8vE9jU8VU9